W.H.O thanked Upasana for participating in the Health Heroes Challenge campaign
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన పై అవగాహన తీసుకొస్తూ సినిమా సెలిబ్రిటీల నుంచి రాజకీయనాయకులు, స్పోర్ట్స్ స్టార్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నరు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై అవగాహన కల్పించడంలో మెగా ఫ్యామిలీ ముందువరసలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మెగా కోడలు కూడా తనవంతు బాద్యత తీసుకుంది. హీరో రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసనా కూడా కోవిడ్-19 నిర్మూలించడం భాగస్వామ్యం అయ్యారు. ఆమె చేస్తున్న సేవను ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ టెడ్రాస్ ప్రశంసిస్తూ స్వయంగా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కరోనావైరస్ పోరులో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యసిబ్బంది నిజమైన హీరోలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. అంతేకాదు ఏప్రిల్7న జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలపాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే థాంక్స్ హెల్త్ హీరోస్ హ్యాష్‌టాగ్ పేరుతో ఒక క్యాంపెయిన్ నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలపడమే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌కు మెగాకోడలు ఉపాసనా స్పందించి ఓ వీడియో చేసి ట్వీట్ చేశారు. ఈ ఆపత్కాల సమయంలో వైద్య సిబ్బందిని ప్రశంసిస్తూ వారి సేవలను కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు ఈ సమయంలో అంతా ఇళ్లకే పరిమితం కావాలని అదే సమయంలో సామాజిక దూరంను కూడా పాటించాలంటూ వీడియోద్వారా చెప్పారు. ఆ వీడియోను ప్రపంచ ఆరోగ్య సంస్థ, తెలంగాణ సీఎంఓకు కూడా ట్యాగ్ చేశారు.
ఉపాసనా పోస్టు చేసిన వీడియోను చూసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ థ్యాంక్స్ హెల్త్ హీరోస్ ఛాలెంజ్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న ఉపాసనాకు ధన్యవాదాలని చెప్పారు. అంతేకాదు ఈ పోరులో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్లు, నర్సులు ఇతరులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏడాదిని వారికి అంకితం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.