Thursday, May 13, 2021

Latest Posts

ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే కరోనాపై యుద్ధం చేయగలం – సోనూసూద్

ఇదివరకే కరోనా నేపథ్యంలో పంజాబ్‌లోని వైద్యులకు 1500 పి‌పిఇ కిట్లను, జుహూలోని తన హోటల్స్‌ని వైద్యులకు, పారిశుద్ధ్య కార్మికులకు వసతికి ఇచ్చిన ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక చిక్కుకున్న వసల కార్మికులను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని రవాణా సౌకర్యం కల్పించి వారి స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా పది బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో  పోరాడుతున్న తరుణంలో ప్రతీ భారతీయుడు తన కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే పోరాడగలదనేది తన నమ్మకం అని, అందుకే ఇలా రోడ్లపై ఇబ్బంది పడుతున్న వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడాను ఆని తెలిపారు. ఇందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించడంతో 10 బస్సుల్లో వారిని తరలిస్తునట్లు తెలిపారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ఇలాంటి వలస కార్మికులకు సహాయం చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఇది కూడా చదవండి: కాబోయే భార్య ఫొటో పోస్ట్ చేసిన రానా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss