Home వైరల్ వరంగల్ బావిలో దొరికిన మృతదేహాలు పై విచారణ వేగవంతం

వరంగల్ బావిలో దొరికిన మృతదేహాలు పై విచారణ వేగవంతం

గీసుకొండ మండలం గోర్రకుంట శివారులో ఉన్న బహిరంగ బావిలో ఒక కుటుంబంలో ఆరుగురితో సహా తొమ్మిది మంది చనిపోయారు. 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్ కు వలస వచ్చిన ఈ కుటుంబం మసూద్, నిషా దంపతులకు అతని కుమార్తె, మూడేళ్ల మనవడు, కుమారులు సోహైల్, షాబాద్, త్రిపురకు చెందిన షకీల్ అహ్మద్, బీహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ మృతదేహాలు బహిరంగ బావిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ కేసు విచారణను వేగవంతం చేశామని వరంగల్ పోలీసు కమీషనర్ తెలియచేసారు. సంఘటన జరిగిన ప్రదేశంలో అన్ని ఆధారాలు సేకరించామని, ఈ కేసు మిస్టరీని చేదించేందులు 6 బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా పోలీసు కమీషనర్ వి.రవీంధర్ తెలియచేసారు. అయితే మసూద్ కూతురు బీహార్ వాళ్ళతో ఉన్న సంబందాలు కూడా పరిగణలోకి తీసుకుని అన్ని విధాలా దర్యాప్తు కొనసాగుతుంది అని తెలియచేసారు.

ఇది కూడా చదవండి: 

 

Exit mobile version