ప్రస్తుతం నెలకొన్న పరిస్తితులలో లైంగిక దాడులు కూడా జరగడం శోచనీయం. ఇటువంటి లైంగిక దాదులు జరగడం కొత్తేమీ కాకపోయిన జరిగిన ప్రతి సారి అలాంటి వారిని ఎలా కాపాడాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఒక సంఘటన రాజమహేంద్రవరం పట్టణం సమీపంలో బొమ్మూరులో వెలుగులోకి వచ్చింది.
అయితే ఇప్పటికే రాజమండ్రిలో కొన్ని ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హంతమొందించిన సంఘటన జరిగి కళ్ల ముందు మెదులుతూ ఉండగానే మళ్ళీ ఇటువంటి సంఘటన జరగడం అంధోలన కలిగిస్తున్న అంశం. అయితే రాష్ట్రంలో మొట్ట మొదటి దిశ పోలీసుస్టేషన్ ఉన్న ఈ ప్రాంతంలో ఇలా జరగడం నిజంగా అధికారులకు సవాలుగా ఈ అంశం మారనుంది. మహిళా సంఘాలు మాత్రం ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారి ఆవేధనను వ్యక్తపరుస్తున్నారు.
ఇది కూడా చదవండి: నాబార్డ్ చైర్మెన్ గా చింతల గోవిందరాజులు