Saturday, March 6, 2021

Latest Posts

తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య నీటి యుద్ధం

హైదరాబాద్‌ : కృష్ణా జలాల అంశంపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ముగిసింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ హాజరయ్యారు. కృష్ణా నుంచి రోజూ 10 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్‌. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ ఏపీ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీవోను కూడా విడుదల చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు. వెంటనే కృష్ణా వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డులో ఫిర్యాదుకు ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం నీటి విషయంలో తెలంగాణను సంప్రదించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదమని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆమె 9 నెల‌ల గ‌ర్భి‌ణీ…అయినా ఆమె సేవలు అద్భుతం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss