West Godavari District Tanuku constituency volunteers every Sunday to win the bandh
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ తో చాలామంది ఇళ్లకే పరిమితం అయిపోయారు. తమ కుటుంబాలతో గడుపుతున్నారు. ఇక కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా నియంత్రణ పాటిస్తూ,కరోనా కట్టడికోసం పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజక వర్గంలో ప్రతీ ఆదివారం స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేస్తున్నారు.
ఓ పక్క లాక్ డౌన్ పాటిస్తూనే ఆదివారం వస్తే చాలు మొత్తంగా బంద్ పాటిస్తూ, కరోనా కట్టడిలో భాగస్వాములవుతున్నారు. అలాగే ఈ ఆదివారం కూడా ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే బంద్ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకూ 39కేసులు నమోదు కాగా, ఏలూరు,తాడేపల్లి గూడెం,పెనుగొండలలోనే32కేసులు వచ్చాయి. ఢిల్లీతో లింకుల కారణంగా ఈ మూడు చోట్ల కేసులు వస్తూనే ఉన్నాయి. భీమవరం,నర్సాపురం,ఉండి, ఆకివీడు,గుండు గొలనులలో కూడా కేసులు నమోదైనా, అక్కడ కొత్తగా ఎవరికీ విస్తరించలేదు. మొత్తం 39కేసుల్లో 9మంది డిశ్చార్జి అయ్యారు.