Saturday, September 19, 2020

Latest Posts

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు

ఆంగ్లంలో జీడీపీ ని Gross Domestic Product. తెలుగులో స్థూల_దేశీయోత్పత్తి అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది. ఉదాహరణకు.. ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80రూపాయలు అవుతుంది. అదే విధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది.అయితే అన్ని ప్రోడక్ట్ ఈ GDP లోకి చేరవు.

ఉదాహరణకు జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన GDP లో చేరదు. జపాన్ దేశపు GDPలో కలుస్తుంది. అలాగే ఈ జీడీపీ లో మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే, ఉదాహరణకు కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము. కానీ వాటితో కారును తయారుచేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్ , సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడీపీ లో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు.

మరొక_ఉదాహరణతీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం దానిని మనం నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది. మరి మన GDP పడిపోయింది అని వింటూ ఉంటాం దాని అర్ధం ఏమిటంటే మన దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువుగా అమ్ముడవడం(కొనడం) లేదు. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడంలేదు కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతె కంపెనీకి లాభాలు ఉండవు. దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది.

మళ్ళీ మన దేశ GDP పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారుచేస్తాయి. దాని వాళ్ళ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ జీడీపీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవ్యస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్దతిలో ఒక దేశం యొక్క జీడీపీ అనేది పెరుగుతూ ఉంటె ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్ధం.

ఇది కూడా చదవండి: ఇక నుండి స్థానిక వస్తువులకు ప్రాధాన్యం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త. కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల...

నేటి నుంచి ఐపీఎల్

ఈ రోజు  నుంచి ఐపీఎల్‌ 13 సీజన్ ప్రారంభం కానుంది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో.యూఏఈ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. నేడు  అబుదాబిలో ముంబై, చెన్నై మధ్య తొలి మ్యాచ్...

సర్కారు కీలక నిర్ణయం

కరోనా రోగులను కుటుంబసభ్యులు కలిసేందుకు రాజస్థాన్ సర్కారు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారి కుటుంబసభ్యులు కలవవచ్చని రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ప్రకటించారు....

Don't Miss

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...