Tuesday, January 25, 2022

Latest Posts

పూజా హెగ్డే సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేదంటే

What Is Pooja Hegde Profession Before Movies

పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని ఇండస్ట్రీలలో ఈ బుట్ట బొమ్మకు బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఆమె తాజాగా నటించిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె సుడి మారిపోయింది. అయితే ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది.

అయితే ఈమె సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేది మరియు ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషకం ఎంత వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూజా సినిమాల్లోకి రాకముందు మోడల్ గా చేసేది. 2009లో మిస్ ఇండియా పోటీలో పాల్గొంది ఈ అమ్మడు. అయితే ఆమె మొదటి రౌండ్ లోనే ఇంటి బాట పట్టింది.

What Is Pooja Hegde Profession Before Movies, Actress Pooja Hegde Biography, Remuneration, 99Telugu, Pooja Hegde Profession, Pooja Hegde Biography, Pooja Hegde Remuneration, Pooja Hegde Movies, Actress Pooja Hegde

అయినా నిరూత్సాహపడకుండా ఆమె తిరిగి మళ్ళీ సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమయ్యింది. ఈ పోటీలో ఆమె రన్నరప్ గా నిలిచి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆమె జీవాతో మూగమూడి అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆమె మొదటి సినిమా అయినా సరే భారీ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసింది ఈ అమ్మడు. ఏకంగా మొదటి సినిమాకే ఈమె ముప్పై లక్షలు అందుకుంది.

ఇప్పుడు తాజాగా అల వైకుంఠపురములో ఇచ్చిన బ్లాక్ బస్టర్ తో ఈ అమ్మడు అమాంతం తన రెమ్యూనరేషన్ ని పెంచేసింది. ఆమె ఏకంగా సినిమాకి మూడు నుంచి ఐదు కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. సౌత్ లో హీరోయిన్ నయనతార తర్వాత అంత మొత్తం తీసుకుంటున్న లిస్ట్ లో చేరింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ రాధే శ్యామ్, ఆచార్య సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే సల్మాన్ ఖాన్ తో భాయిజాన్ అనే సినిమాను చేయనుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss