WhiteHouse unfollowed PM Modi and President Ram Nath Kovind on twitter
భారత్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ని, ప్రధాని మోదీని, వైట్ హౌస్ ట్విటర్లో అన్‌ఫాలో చేసింది. ప్రస్తుతం శ్వేతశౌధం అమెరికా అధ్యక్షుడితో సహా మొత్తం 13 అమెరికా హ్యాండిల్స్‌ను మాత్రమే ఫాలో అవుతోంది. మూడు వారాల క్రితం వైట్‌హౌస్ ట్విట్టర్ హ్యాండిల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అయింది. అంతే కాకుండా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను, అమెరికాలోని భారత్ ఎంబసీ ట్విట్టర్ హ్యాండిళ్లను కూడా వైట్ హౌస్ ఫాలో అయింది. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు అన్ ఫాలో చేసిందో ఎవరికి అర్దం కావడం లేదు.
కొన్ని రోజుల క్రితం ట్రంప్ భారత్ నుండి మలేరియా ఔషధం హెచ్‌సీక్యూను అగ్రరాజ్యానికి సరఫరా చేసినందుకు గాను పొగడ్తల్లో ముంచెత్తారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం అని కూడా అప్పట్లో ట్రంప్ ట్వీట్ చేశారు అలాగే చేసిన మేలును మర్చిపోమన్నారు. ఆ సమయంలోనే వైట్‌హౌస్ భారత ప్రధానిని ఫాలో అవడం అందరినీ ఆకర్షించింది. అమెరికా-భారత్‌ల బంధం మరింత బలపడిందని నెటిజన్లు కోడైకుస్తున్నారు . మరి ఇప్పుడు ఏమైందో, వైట్ హౌస్ భారత ప్రధానిని ట్విట్టర్లో ఎందుకు అన్‌ఫాలో చేసిందో ఇప్పుడు స్పష్టంగా తెలియదు. ఈ చర్య వల్ల భారతదేశం మరియు అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలకు దారీతిస్తాయో వేచిచూడాలి.