Thursday, January 21, 2021

Latest Posts

అరవై లక్షల మంది నర్సు లు తక్కువయ్యారట

WHO announced Sixty million nurses are short

ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా మహమ్మారి  రోజురోజుకూ విజృభిస్తోంది.  ఈ  తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అరవై లక్షల మంది నర్సులు తక్కువయ్యారట. ఇది స్వయంగా   ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనా పోరులో నర్సులు తదితర ఆరోగ్య సిబ్బంది పాత్ర చాలా ముఖ్యమైందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థకు నర్సులే వెన్నెముకలని, ప్రపంచ దేశాలు నర్సుల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.

నర్సుల సంఖ్య తక్కువగా ఉండడం  కొనసాగితే భవిష్యత్తులో కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. కావున ప్రపంచ దేశాలు ముందుగానే మేలుకొని నర్సింగ్ గ్రాడ్యుయేట్లను సంవత్సరానికి 8శాతం చొప్పున పెంచుకుంటూ రావాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. అలాగే ఈ నర్సుల్లో 80శాతం మంది  అధిక జనాభా గల దేశాల్లోనే సేవలందిస్తున్నారని తెలిపింది.

కాగా కరోనా  మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అల్లాడిపోతోంది.  గడిచిన 24గంటల్లో అమెరికాలో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 1,939 కరోనా బాధితులు తుదిశ్వాస విడిచినట్లు జాన్స్ హాప్‌కిన్స్ కరోనా ట్రాకర్ సూచిస్తోంది. ఒక్కరోజులో కరోనా కారణంగా అమెరికాలో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. మొత్తం కరోనా కేసులు 4,06,693కాగా వారిలో 13,089మంది కన్నుమూశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి  ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని అధికారులు చెప్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss