WHO gave some advice on how to take care of people’s health
లాక్ డౌన్ కరణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఇలా ఇళ్లకే పరిమితమైప్పుడు ప్రజలు ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రతలు తీసుకోవలో అన్న దానిపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్ద్రోస్ఆధానోమ్ ఘెబ్రెయేసుస్ కొన్ని సలహా ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు.
మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోండి. చక్కెర పానీయాలను పరిమితం చెయ్యాలి, మద్యం పూర్తిగా మానేస్తే మంచిదని అలాగే ధూమపానం చేయవద్దు, ఇవి తీసుకోవడం వల్ల COVID-19 లక్షణాలను పెంచుతుంది అలాగే తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది అని తెలిపారు. పెద్దలు రోజుకు కనీసం 30 నిమిషాలుమరియు పిల్లలు రోజుకు ఒక గంట వ్యాయామం చెయ్యాలి అని సూచించారు. అలాగే బయటికి వెళ్ళడానికి అనుమతి ఉంటే నడక, పరిగెత్తడం చెయ్యాలి కుదరకపోతే ఇంట్లో ఉండే డ్యాన్స్ చేయండి అలాగే కొంత సమయం యోగా చేయండి లేదా మెట్లు పైకి క్రిందికి నడవండి అని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోం పనిచేసే వారు మరియు ఒకే స్థానంలో ఎక్కువసేపు వర్క్ చేసే వారు ప్రతి 30 నిమిషాలకు 3 నిమిషాల విరామం తీసుకోండి. వత్తిడులకు లోనూ కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సంగీతం వినండి, పుస్తకం చదవండి లేదా ఆటలు ఆడండి. ఇవి పాటించడం వల్ల దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండటమే కాదు COVID-19తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది’ అని టెడ్ద్రోస్ తెలిపారు.