టీకా అసలు వీరికి ఇవ్వనే ఇవ్వొద్దని డబల్యూహెచ్ఓ హెచ్చరించింది. దాదాపుగా ఏడాది పాటు కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. మన దేశంలో మార్చి నుంచి ఈ మహమ్మారి తీవ్రంగా దాడి చేసింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తయారీ కోసం ఏడాదిగా శ్రమించిన శాస్త్రవేత్తలు 2021 సంవత్సరంలో దాన్ని రిలీజ్ చేశారు.
తాజాగా భారత్ లో రెండు టీకాలకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ ఈనెల 16 నుంచి భారత్ లో పంపిణీ కానున్న నేపథ్యంలో డబల్యూహెచ్ఓ కీలక సూచనలు జారీ చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే టీకా వేసుకునే వారికి ఈ లక్షణాలు ఉండొద్దని ఇవి ఉంటే వారికి టీకాలు ఇవ్వొద్దని తెలిపింది. ముఖ్యంగా తీవ్రమైన అలర్జీ ఉన్నవారికి, గర్భిణిలు, పాలిచ్చే బాలింతలకు, 16 ఏళ్లలోపు పిల్లలు కోవిడ్ టీకా ఇవ్వకూడదని తెలిపింది. వారి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వారిపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: