WHO director strong comments on coronavirus:
చైనా నుంచి ప్రపంచానికి పాకిన కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు కరోనా వైరస్ను చైనా వైరస్ అంటూ వ్యాఖ్యానించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు హెచ్ ఓ) స్పందించింది. అధ్యక్షుడి తరహాలో చైనా వైరస్ అని పిలవడమనే అనవసరంగా చైనాను టార్గెట్ చేసినట్లవుతుందని ఎగ్జిక్యువ్టివ్ డైరెక్టర్ మక్ రైయన్ పేర్కొన్నారు.
‘వైరస్లకు ఏ సరిహద్దులనూ పట్టించుకోవు. నీ జాతి ఏది అనేది, నీ దగ్గర ఎంత ధనం ఉంది, నీ శరీర రంగు ఏమిటి అనే విషయాలను పట్టించుకోవు. కాబట్టి మనం వాడే పదజాలం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి పేర్ల వల్ల వివక్ష పూరిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది’ అని మక్ రైయన్ వ్యాఖ్యానించారు.
ఇక తాజాగా ఐక్యరాజ్య సమితి నిపుణులు తాజాగా వెల్లడించిన వివరాలు ప్రతి ఒక్కరిని నివ్వెరపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది( ప్రపంచ జనాభాలో 40 శాతం మంది) ప్రజలు ఈ వైరస్ బారినుంచి తప్పించుకునే అవకాశమే లేదని పేర్కొంది. ఈ మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేస్తూ, కనీసం సబ్బు, నీళ్లు కూడా లేక వారు అల్లాడిపోతున్నారని పేర్కొంది.