Thursday, December 2, 2021

Latest Posts

స్మార్ట్ ఫోన్ లో బయటకు తీసే బ్యాటరీ ఎందుకు ఇవ్వడం లేదంటే

Why Mobiles Coming With Non Removable Battery

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోను ఉంటుంది. ఇంతకముందు మొబైల్స్ లో బ్యాటరీ బయటకు వచ్చేలా ఉండేది. అయితే స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుండి బ్యాటరీ లోపలే ఉండేలా ప్లాన్ చేశారు. అసలు దీని వెనుక అసలు కారణం ఏమిటి స్మార్ట్ ఫోన్స్ లో బ్యాటరీ నాన్ రిమూవబుల్ గా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ లైట్ వెయిట్ గా ఉండడం కోసం బ్యాటరీ నాన్ రిమూవబుల్ గా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఫోన్స్ లో దీనికోసం ప్రత్యేకమైన సెటప్ చేయాల్సి వచ్చేది. అయితే ఇలా చేయడం వల్ల మొబైల్ చాలా లైట్ వెయిట్ గా మారి స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. అంతే కాదు మొబైల్ లో నుంచి బ్యాటరీ మాటి మాటికి తీసి వేస్తూ ఉండడం, సిమ్ పెట్టడం కోసం బ్యాటరీ తీయడం వల్ల ఫోన్ లు పాడైపోతు ఉండేవి. అయితే ఇప్పుడు బ్యాటరీ తో సంబందం లేకుండా నే మొబైల్స్ తయారు చెయ్యడం వల్ల మొబైల్స్ ఎక్కువకాలం మన్నిక వస్తున్నాయి.

ఇవే కాకుండా మరొక రీజన్ కూడా ఉంది, అదేమిటంటే పాత మొబైల్ ఫోన్స్ పోతే వాటి బ్యాటరీ మార్చి ఇంకో బ్యాటరీ వేస్తే దానిని కనిపెట్టడం కష్టం అయ్యేది. అదే ప్రస్తుత స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ తీయడం కుదరదు కాబట్టి మీరు ఈజీగా దానిని ట్రాక్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss