Thursday, February 25, 2021

Latest Posts

అర్ధరాత్రి భర్తను హత్య చేసిన భార్య

Wife Killed Husband

కట్టుకున్న భర్తనే భార్య క్రూరంగా చంపేసింది. గాఢ నిద్ర లో ఉన్న భర్తని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి హతమార్చింది. అనంతరం లోకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో బేతంచర్ల మండల పరిధిలోని గోర్లగుట్ట గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఇక పోలీసుల సమాచారం ప్రకారం గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఆంజనేయులు(35)కు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తెలు పూజిత, వర్షిణి, కుమారుడు హేమంత్‌ ఉన్నారు. అయితే పాలీస్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. కాగా కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న వడ్డె ఆంజనేయులు తాగుడుకు బానిసై వేధించడం మొదలుపెట్టాడు.

ఈక్రమంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. ఈ బాధ భరించలేక అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తను భార్య గొడ్డలితో విచక్షణారహితంగా నరికి హత్య చేసింది. అనంతరం స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss