Tuesday, March 2, 2021

Latest Posts

ఈ సంక్షోభంలో పవర్ స్టార్ మూవీస్ కంటిన్యూ అవుతాయా  

Will Power Star pawan kalyan Movies Continue In This corona Crisis

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి సినీ రంగానికి రీ ఎంట్రీ ఇస్తూ,పింక్ రీమేక్  వకీల్ సాబ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ   దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓ  చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు మాయదారి  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. దాంతో భారత దేశంలో లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు మే3 వరకూ పొడిగించారు.  కరోనా మహమ్మారి అందరినీ దెబ్బతీసింది. అన్ని రంగాలను కుంగదీసింది. దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. అయినా ప్రజారోగ్యం దృష్ట్యా  ఈవేళ్టితో ముగియాల్సిన లాక్ డౌన్ మే3వరకూ పొడిగించారు. ఇక ఇప్పటికే మూతపడ్డ సినిమా ఇండస్ట్రీ లాక్ డౌన్ తో తెరవలేని పరిస్థితి వచ్చేసింది.

అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే గప్ చిప్ అన్నట్లు  ఇళ్లకు పరిమితమయ్యారు. కాకపొతే  పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ ల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే  కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి, ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేసాడు. అయితే  మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇక హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే కొత్త సినిమాలేవీ ఓకే చేయకూడని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించిన ఒప్పందాలు ఆపేయాలని అనుకుంటున్నట్లు టాక్. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడడంతో మిగిలిన సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, అసలు షెడ్యూల్ కుదురుతుందా ,కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే సినిమాల షూటింగ్స్ ఊపందుకుంటాయి అనేది అప్పుడే చెప్పలేం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss