within half-an-hour liquor delivery on your doorsteps-online scams
లాక్ డౌన్ నేపథ్యంలో కొంతమంది కేటుగాళ్లు ఆన్లైన్లో విక్రయాలు అంటూ క్యూఆర్ కోడ్ పంపించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు హైదరాబాదులో వెలుగులోకి వచ్చాయి. బగ్గా వైన్స్ పేరిట ఆన్లైన్లో తక్కువ ధరకే మరియు అరగంట సమయంలోనే మీఇంటికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పి గౌరీ పురానికి చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి రూ 51వేలు వసూలు చేశారు.
ఎంతసేపయినా మద్యం బాటిల్స్ డెలివరీ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ మోసం క్రింద కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా సదరు బగ్గా వైన్స్ యజమాన్యం అయిదు రోజుల క్రిందటే తమ పేరిట ఎవరో అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులకు కంప్లైంట్ చేశామని చెప్పడం కోశ మెరుపు.