Saturday, June 19, 2021

Latest Posts

ఒకే కాన్పులో పది మంది పిల్లలు

Woman Gives Birth To 10 Babies

ఒకే కాన్పులో పది మంది పిల్లలు. అవునండి ఇది నిజం. దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్‌హోల్‌ అనే మహిళ 10 మంది పిల్లలను ప్రసవించింది. ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరిగిందని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. ఇందులో ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తన భార్య గర్భం దాల్చి ఏడు నెలలు మాత్రమే అయ్యిందని అయితే సడెన్ గా నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా పిల్లలను ప్రసవించిందని చెప్పారు. ఒకే సారి 10 మంది ప్రసవించడం అనేది ఒక కొత్త గిన్నీస్ రికార్డు అవ్వబోతుంది. సిట్‌హోల్‌ ఇంతకముందు కవలలకు జన్మనిచ్చింది. రెండోసారి సహజ గర్భం దాల్చానని సిట్‌గోల్‌ గతంలో వెల్లడించింది.

సిట్‌హోల్‌ గర్భంలో ఆరుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు చెప్పారు.  ఆ తర్వాత స్కానింగ్‌ చేయిస్తే 8 మంది ఉన్నట్లు తేలిందని వివరించింది. తీరా ప్రసవంలో ఆ సంఖ్య 10 మందికి చేరింది. అయితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, తల్లి మరియు పిల్లల విషయం పై వైద్యులు ఇంకా ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss