పిడుగురాళ్ల గుంటూరు జిల్లాకు చెందిన జూలకంటి రాధిక అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కు వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో నివాసం ఉంటూ రాధిక భర్త లచ్చిరెడ్డి, ఆయన సోదరుడు వాటర్‌ప్లాంట్ నడుపుతూ ఒకేచోట కలిసి వుంటున్నారు. వారు నివాసం ఉంటున్న దగ్గర జూలకంటి రాధిక తోడికోడలి ఐదేళ్ల కుమార్తె ఈనెల 14న తెలియక లైజాల్ లిక్విడ్ తాగి చనిపోయింది.
తన కుమార్తె చనిపోవడానికి రాధికే కారణం అంటూ నిందలు వేస్తూ వేధింపులకు గురిచేయడంతో ఆమె అవమానభారంతో హైదరాబాద్ నుంచి తన ఇద్దరు పిల్లలను తీసుకుని వారం రోజుల క్రితం తుమ్మలచెరువులోని తన పుట్టింటికి వచ్చింది. ఆమెకు పుట్టింటికి వచ్చిన తర్వాత కూడా తోడికోడలు వేధింపులు ఆగకపోవటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావడంతో ఇంక వేధింపులు భరిచలేక ఆమె తన ఇద్దరు పిల్లలు క్రిస్టప్ రెడ్డి (4), రుషిత (3)లకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రులు గమనించే సరికి ఈ దారుణం జరిగింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: క్షుద్ర పూజల పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం