Thursday, December 2, 2021

Latest Posts

హీరో ఆర్య ని ఇన్వెస్టిగేషన్ కి పిలిచిన చెన్నై పోలీసులు

Women Filed Cheating Case On Tamil Hero Arya

మంగళవారం సాయంత్రం చెన్నైలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ నటుడు ఆర్యను సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి పిలిచారు. ఈ హీరో పెళ్లి అనే సాకుతో మోసం చేశాడని విద్జా అనే మహిళ తన ఫిర్యాదును పిఎంఓకు పంపింది. లాక్డౌన్ సమయంలో అతను తన నుండి రూ.71 లక్షలు వసూలు చేశాడని ఆమె ఆరోపించింది.

ఈ విద్జా అనే మహిళ జర్మినీలో నివశిస్తుంది. అయితే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. హైకోర్టు ఆదేశాల మేరకు చెన్నై పోలీసులు ఈ హీరోని విచారణకు పిలిచారు. ఈ హీరో, హీరోయిన్ సయేషా సైగల్‌ని మార్చి 2019 లో వివాహం చేసుకున్నారు. తాజాగా ఇతను నటించిన సార్పట్ట సినిమా ఓటిటిలో విడుదల అయ్యి ప్రేక్షకుల మన్నన పొందింది. అయితే ఇప్పుడు ఇలా అతను కేసులో ఇరుక్కోవడం అతని అభిమానులను కలవరపరిచింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss