Women in long queues at liquor shops
కరోనా ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్ సడలింపులతో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా ఈ రోజు మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో మందుబాబులు భారీ క్యూలు కట్టారు. అలాగే తాము ఏ వేషయంలోను తగ్గమని మందుబాబులతో పాటు మందు మహిళలు కూడా రోడ్డెక్కారు.
అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నాం ఈ ఒక్క విషయంలో వెనుకబాటు ఎందుకు అనుకున్నారేమో ఏకంగా లిక్కర్ షాపుల దగ్గరకే వచ్చేశారు. వివరాల్లోకెళితే బెంగళూరులో ఓ మద్యం దుకాణం ఎదుట ఇలా మహిళలు క్యూలో నిలిచినున్న ఫొటో ఒక్కటి ఇప్పుడు వైరల్గా మారింది. అయితే, అది చూసిన షాప్ యజమాని మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటుచేశారు.