Thursday, May 13, 2021

Latest Posts

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజ్రంభన

World has in hectic situation during corona :

అన్నీ దేశాలలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద కరోనా ఎఫెక్ట్ అయిన వారి సంక్య 33 లక్షలుకు చేరి వీరిలో 2 లక్షల 37 వేలమంది చనిపోయారు.  కాగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10 లక్షల 67 వేలకు కావడం ఊరటనిచ్చే అంశం. కాగా ప్రస్తుతానికి 23 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. కాగా తాజా విశ్లేషణల ప్రకారం ప్రజలలో వైరస్ ను తట్టుకునే శక్తి అంతకంతకూ పెరుగుతూ ఉండడం వలన కరోనా ఉదృతి కొంతలో కొంత తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది అంటున్నారు పరిశోధకులు.

యూరోప్ దేశాలలో కరోనా ప్రభావం శోచనీయంగా ఉంది. మొత్తం 2 లక్షల 34 వేల కేసులు ఇక్కడ నమోదయ్యాయి. వీరిలో 24.824 మంది మృతి చెందారు. ఇటలీలో కూడా కరోనా కేసులు 2 లక్షలు దాటగా 28.200 మండి మరణించారు. ఫ్రాన్స్ లోనూ ఇదే పరిస్తితి నెలకొంది, లక్ష 67 వేల మంది కరోనా బారిన పడగా 24 వేల మండి మరణించారు. కాగా ప్రపంచం మొత్తం మీద కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్యా 10 లక్షలు దాటటం ఊరటనిచ్చే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నియమాలు పాటిస్తూ, స్వీయ రక్షణలో ఉంటే కరోనా ఉదృతిని కంట్రోల్ చేయవచ్చు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss