Sunday, June 20, 2021

Latest Posts

కే‌జి‌ఎఫ్ స్టార్ యశ్‌ భారీ విరాళం

Yash Donate 1.5 Crore Rupees

లాక్‌డౌన్‌ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. ఇందులో సినీ పరిశ్రమ ఒకటి. షూటింగ్‌లు జరిగేతే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు కన్నడ స్టార్‌ యశ్‌. కన్నడ చిత్రపరిశ్రమలోని పని చేసే సినీకార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు కే‌జి‌ఎఫ్ స్టార్.

“కరోనా వైపరీత్యం వల్ల కన్నడ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. చిత్రరంగంలోని 21 విభాగాలకు చెందిన మూడు వేలమందికి తలా 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఆర్జించిన సంపాదనలో నుంచి ఇస్తున్నాను. ఈ చిన్నపాటి ఆర్థిక సాయం వారికి శాశ్వత పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఉందాం” అంటూ ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశాడు. యశ్‌ తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss