Monday, July 26, 2021

Latest Posts

యష్ కేజీఎఫ్ 2 కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Yash KGF 2 Release Date

ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. మొదటిగా ఈ చిత్రం జూలై 16న విడుదల కావాల్సి ఉంది, కాని సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ ని పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

అయితే విడుదల తేదీ పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. జూలై 16లోపు సినిమాని థియేటర్ లోకి తీసుకురావడం కష్టతరం కాబట్టి చిత్రబృందం కొత్త సినిమా తేదీని ఎంచుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ‘కేజీఎఫ్ 2’ నిర్మాతలు సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్‌లలో కోవిడ్ -19 ‘థర్డ్ వేవ్’ ముప్పు ఉంది కాబట్టి నిర్మాతలు తొందరపడి విడుదల తేదీని ప్రకటించడం లేదు.

ఒక వేల థర్డ్ వేవ్ వస్తే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారట. నిర్మాతలు డిజిటల్ హక్కుల కోసం చర్చలు జరుపుతున్నారు మరియు అమెజాన్ ప్రైమ్ చాలా ఆసక్తిని కనబరుస్తోంది. మరి చివరకు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss