YCP Clean Sweep Hindupur Constituency
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక పంచాయితీ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ హిందూపురం ప్రాంతంలో అధికార వైఎస్ఆర్సి పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ దెబ్బతో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణ హవా తగ్గినట్టు గా కనిపిస్తుంది. హిందూపురం నియోజకవర్గంలోని 38 స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు 30 స్థానాల్లో గెలిచారు.
తెలుగు దేశం పార్టీకి కంచు కోటగా పరిగణించబడుతున్న హిందూపురం ఓటర్లు తమ విధేయతను పాలక వైయస్ఆర్సి పార్టీకి వేయడంతో టిడిపి కాస్త షాక్ కి గురి అయ్యింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే నిమ్మల కిస్తప్ప కూడా తన గ్రామమైన వెంకటరమణపల్లిలో పార్టీ ఓడిపోవడంతో టిడిపి కి కాస్త గుబులు మొదలయ్యింది.
తన సొంత గ్రామంలో పార్టీ ఓడిపోవడంతో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారధికి కూడా షాక్ తగిలింది. పెనుకొండలోని 80 గ్రామాల్లో 71 గ్రామాలను వైయస్ఆర్సి పార్టీ గెలిచి అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసింది.
ఇవి కూడా చదవండి: