Monday, July 26, 2021

Latest Posts

ఎన్‌డి‌ఏ లో చేరనున్న వైసిపి

YCP To Join NDA

తాజా సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్‌డి‌ఏ లో కలపాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. గత వారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం కావాలంటే షరతులు లేకుండా ఎన్‌డిఎలో చేరాలని షా ఏ‌పి‌ ముఖ్యమంత్రి జగన్ కి చెప్పినట్లు తెలుస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో రెండు సీట్లు పెంచనుండడంతో ఈ సీట్లను ప్రధాని నరేంద్ర మోడీ వైయస్ఆర్సిపికి ఇవ్వాలని యోచిస్తుందట. అయితే ఇది కేంద్ర మంత్రివర్గం యొక్క చివరి విస్తరణ కానుంది కాబట్టి, వైసిపికి మళ్ళీ అవకాశం రాకపోవచ్చుని షా జగన్ తో చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక కేంద్రం నుండి ఎటువంటి ప్రయోజనాలు లేకుండా ఎన్డీఏలో చేరడానికి ఆసక్తి చూపడం లేదు జగన్ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు కావల్సిన నిధులను ఆమోదించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. మరి నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణ చేపట్టే ముందు జగన్ ఈ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss