Sunday, July 25, 2021

Latest Posts

కరోనా వైరస్ నుంచి మనల్ని కాపాడేది యోగా – మోడి

Yoga A Ray Of Hope In COVID Times

7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రశంసించారు. యోగా అంతర్గత శక్తిగా మారింది మరియు కరోనావైరస్ మహమ్మారిని ఎదిరించగలమనే ధైర్యాన్ని,నమ్మకాన్ని కలిగించింది,అని మోడీ అన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించి బలం చేకూరుస్తుందని మోడి అన్నారు.

కరోనా మొదటి రోజుల్లో ఏ దేశమూ సిద్ధం కాలేదని పీఎం అన్నారు. యోగా మాత్రమే అప్పుడు సాయ పడిందని చెప్పారు. యోగా క్రమశిక్షణలో సహాయపడుతుంది మరియు ఈ వైరస్‌తో పోరాడగలరని ప్రజలలో విశ్వాసం కలిగించిందని చెప్పారు. వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటానికి యోగా తమ శక్తి అని ఫ్రంట్లైన్ వర్కర్స్ నాకు చెప్పారు, అని పిఎం మోడీ అన్నారు.

ప్రపంచంలోని చాలా దేశాలు యోగాను మర్చిపోయారని అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం అని పిఎం యోగను ప్రశంసించారు. మన శరీరంపై యోగా వల్ల కలిగే ప్రయోజనాలు మరియు రోగనిరోధక శక్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయని అన్నారు. యోగా శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా పెంపొందిస్తుందని తెలిపారు.

ఇక చివరగా మోడీ ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం యోగా దినోత్సవం యొక్క థీమ్ “శ్రేయస్సు కోసం యోగా” మరియు యోగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు వైరస్ తో పోరాడటానికి కావలసిన రోగనిరోధక శక్తిని పెంచుతుంది అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss