You know what’s going on in those countries on Corona
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన కరోనా గురించే తప్ప మరో చర్చ లేదు. కరోనా ఎఫెక్ట్ వలన ఇటలీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. 80ఏళ్లకు పైబడినవారికి చికిత్సకు ప్రభుత్వం నో చెబుతుంది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే వృద్ధులకు రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇటలీలో 27వేల మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇటలీలో 2,158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 6కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు.
కాగా ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోకుంటే లక్షల్లో మరణాలు తప్పవని హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తే..ఇరాన్లో 12వేల దగ్గర మృతుల సంఖ్య ఆగుతుంది..సహకరించకుంటే 35లక్షల మంది చనిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఫ్రాన్స్‌లో అయితే కరోనా ఎఫెక్ట్ తో 148 మంది మృత్యువాత పడ్డారు. దీంతో 15 రోజుల పాటు దేశమంతా ప్రభుత్వం లాకౌట్ ప్రకటించింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కఠిన ఆంక్షలు విధించారు. కారణం లేకుండా బయటకు వస్తే రూ.11 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. మాంద్యం సందర్భంగా కంపెనీలను జాతీయం చేయాలని కూడా భావిస్తోందట.