ఇప్పుడు సినిమా విడుదల కు ముందు వీరలెవెల్లో ప్రచారం సాగించాలి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా నటులంతా ప్రమోషన్ వర్క్ తమ శాయశక్తులా చేస్తుంటారు. ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే నయన తార లాంటి వారు చాలా తక్కువ. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే వేళలో ప్రిరిలీజ్ ఫంక్షన్ చేస్తూ వస్తున్నారు. అందుకు కొనసాగింపుగా కొత్తగా మ్యూజికల్ నైట్ కూడా స్టార్ట్ అయింది. దీంతో సినిమా మీద మరింత ఆసక్తి పెంచేస్తుంటారు. సినిమా విడుదలకు ముందు ప్రెస్ మీట్ పెట్టటం, కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇప్పించటం ద్వారా భారీ మైలేజీ సొంతం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
సరిగ్గా సినిమా విడుదలకు ముందు మీడియాలో ఎక్కడ చేసినా తమ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసే అలవాటు ఈ మధ్యన ఎక్కువైంది. అంతేకాదు, బుల్లితెరలో నిర్వహించే బిగ్ బాస్ వంటి పాపులర్ షోలకు వెళ్తున్నారు. అయితే పూజాహెగ్డే నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో ప్రమోషన్ కు పెద్దగా రాలేదు. సినిమా విడుదలకు ముందు మీడియాలో బన్నీ, త్రివిక్రమ్ మాత్రమే కనిపించారు. అక్కడా పూజా కనిపించలేదు. అయితే మ్యూజికల్ నైట్ ఫంక్షన్ కు కనిపించిన ఆమె.. ఆ తర్వాత సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్టీలో దర్శనమిచ్చింది.
ఏదిచేసినా చర్చ జరగడం మామూలే కదా. అందుకే పూజా ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తోందన్న అనుమానం సహజం. సినిమా విడుదలకు ముందు పూజాను ప్రమోషన్ వర్క్ కు వాడలేదు. ఎందుకంటే, ఆమె ప్రమోషన్ వర్క్ కు వస్తే, మీడియా ఆమెకు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వటం.. గ్లామర్ విషయాలే తప్పించి,సినిమాకు పెద్దగా హెల్ప్ కాదన్న ఉద్దేశంతోనే దూరంగా ఉంచారట. తాజాగా భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో సినిమాకు మరింత గ్లామర్ టచ్ ఇవ్వడానికి పూజాను రంగంలోకి దించారట. పూజను ప్రమోషన్ వర్క్ కు దూరంగా ఉంచటం ద్వారా అందరి ఫోకస్ సినిమా మీద మాత్రమే పడేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు టాక్.