Thursday, December 2, 2021

Latest Posts

కృష్ణ జిల్లాలో మరో గ్యాంగ్ వార్

Youth gang war at Vijayawada

ఇబ్రహీంపట్నంలో కొంతమంది యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్నిహితుల దినోత్సవం రోజున విహారయాత్రవెళ్ళిన స్నిహితులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా జనసంచారం అంతగా ఉండని బూడిద చెరువు వాటర్ ఫాల్స్ వద్దకు కొంతమంది యువకులు విహారయాత్రకు వెళ్ళగా యాత్రలో యువకుల మధ్య మాటకు మాట పెరగడంతో కిలేశపురం  జాతీయ రహదారి  వద్ద యువకుల ఘర్షణకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ దారుణ ఘటన సాయంత్రం 5:00 గంటల సమయంలో జరిగింది. ఈ ఘర్షణలో ఒక యువకుడు గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసుల రాకను చూసిన యువకులు పరారయ్యారు. ఆ యువకుల దాడి ఘటన సమయంలో ఉన్న వారు  వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు యువకులను గుర్తించే పనిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss