Wednesday, April 21, 2021

Latest Posts

వారిని రాష్ట్ర సరిహద్దులకు తరలించండి

కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందవద్దని, అనుమానం వస్తే ఎవర్ని సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను కరపత్రంలో పొందుపరచాలని, వాటిని ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలని కోవిడ్‌ –19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా వచ్చిన వారి పట్ల కొంతమంది వివక్ష చూపుతున్నారని దానిని మానుకోవాలని కోరారు. జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాలని, వాటిని విడతల వారీగా ఎలా ప్రారంభించాలో ఎస్‌ఓపీలు రూపొందించాలని తెలిపారు.

కరోనా పై ప్రజల్లో భయం, ఆందోళన తగ్గించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్యానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందు వచ్చేలా చూడాలని తెలిపారు. అలాగే ఏపీ గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్నారు జగన్. మండుటెండలో పిల్లా,పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల పరిస్ధితిని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి గారు వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని ప్రత్యక బస్సులు ద్వారా రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు.

ఇది కూడా చదవండి: వెనక్కి తగ్గిన ఏపీ ఎస్ ఆర్టీసీ ఎవరినీ తొలగించబోము

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss