YS jagan launches YSR Sunna Vaddi scheme at CM’s camp office
పొదుపు సంఘాల ద్వారా అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ ఇస్తున్నట్లు గురువారం ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన రూ.1,400 కోట్లు జమ అయ్యాయి.
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిద జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ జులై 8 వైఎస్సార్ జయంతి రోజున అర్హులు అందరకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. దాదాపు 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని పేర్కొన్నారు.