Thursday, December 2, 2021

Latest Posts

ప్రజలకు మరింత దగ్గర కానున్న సీఎం

YS Jagan Mohan Reddy Joins Koo App

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పలువురు ప్రముఖుల లాగా కూ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత దగ్గర కానున్నారు.అయితే ఈ వివరాలను యాప్‌ ప్రతినిధులు ఓ పత్రికాలో తెలిపారు. భారత మైక్రో బ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన కూ యాప్‌ వినియోగదారులకు స్థానిక భాషలలో సైతం ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కల్పిస్తోంది. అలాగే ఏపీ ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ కూడా ఈ సోషల్‌ వేదికపై తమ అధికారిక ఖాతాలను ప్రారంభించాయి. ఇకపై తెలుగులోనే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలతో ఇంటరాక్ట్‌ అవుతారని, ప్రజలు తమ సీఎంతో https://www.kooapp.com/profile/ysjagan ద్వారా చేరువ కావచ్చునని యాప్‌ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఇఓ రాధాకృష్ణ, సహ వ్యవస్థాపకులు మయాంక్‌ బిడావక్తలు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తమ సోషల్‌ వేదిక ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్‌ అవుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss