YS Jagan Suspended EC Ramesh Kumar
ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని గవర్నర్‌కు పంపగా వెంటనే ఆయన దానికి ఆమోద ముద్ర వేశారు. దీంతో జగన్ సర్కారు వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేష్ కుమార్‌ను తపిస్తున్నట్లు తెలిపింది.
మార్చి నెలలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అలా ప్రకటించడంతో నాటి నుంచి నేటి వరకూ రాష్ట్రంలో పెద్ద రగడే జరుగుతోంది. తర్వాత రమేష్ కుమార్‌పై సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని నేతల వరకూ తీవ్ర విమర్శలు గుప్పించడంతో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ ప్రోద్బలంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార పక్షం ఆరోపించింది. సీఎం జగన్ సైతం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించిన విషయం తెలిసినదే.
కానీ ఇప్పుడు జగన్ సర్కార్ చేస్తున్న ఈ చర్యలు రాజ్యాంగం విరుద్ధమని అని న్యాయనిపుణులు చెబుతున్నారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.