Sunday, June 20, 2021

Latest Posts

కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్ కళ్ళు మూసుకొని పాలన చేస్తున్నారు

YS Sharmila Fires On KCR Government
రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనతీరుపై వైఎస్‌ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. కరోనా కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, కేసీఆర్‌ కళ్లు చెవులు మూసుకుని పరిపాలన చేస్తున్నారంటూ గురువారం ట్విట్టర్లో ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ పాలన పిల్లి కళ్లుమూసుకని పాలు తాగుతున్న చందంగా ఉందని ఆరోపించారు. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కోసం జనం క్యూలు కట్టేది, రూ.3500 ఇంజెక్షన్‌ రూ.40వేలు పెట్టి కొంటున్నామన్న తెలంగాణ ప్రజల గగ్గోలు కేటీఆర్‌కి కనిపించట్లేదు వినిపించట్లేదని విమర్శించారు.

“ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే నాకేం పట్టి అని చూస్తున్నరు. తండ్రీకొడుకులు గారడి మాటలు పక్కన పెట్టి బెడ్లు,ఆక్సిజన్,వ్యాక్సిన్,రెమిడివిసిర్ల కొరత ఉందని ఒప్పుకొని, వాటిని ఎలా అందించాలో ఆలోచించండి.” అంటూ విమర్శల దాడి చేశారు వైఎస్ షర్మిల.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss