Sunday, June 20, 2021

Latest Posts

ఇంటికో ఉద్యోగం ఏమైంది కే‌సి‌ఆర్

YS Sharmila Questions KCR About Jobs In Telangana

ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి దశాబ్ధ కాలం పాటు పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం మళ్లీ పోరాడాల్సిన అవసరం వస్తుందని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల అన్నారు. నిరుద్యోగంతో ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మెదక్‌ జిల్లా శేరిల్ల గ్రామానికి చెందిన కొట్టమొల్ల వెంకటేశ్‌ (23) కుటుంబాన్ని ఆమె బుధవారం పరామర్శించడానికి వెళ్లారు. ఆ తరువాత ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లి వెంకటేశ్‌ లాంటి నిరుద్యోగ యువత తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.

ఇవే కాకుండా తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయని, నిరుద్యోగం, రైతుల సమస్యలు ఇలా అన్నీ సమస్యలకు కలిసి పోరాడుదాం అని షర్మిల పిలుపునిచ్చారు. షర్మిల తెలంగాణాలో కొత్త పార్టీ పేరును జూలై 8న,వైఎస్‌ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు సందర్భముగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss