YS Sharmila Shocking Comments On CM Jagan
బుధవారం యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశం నిర్వహించిన వైయస్ షర్మిల తన అన్న, ఎపి సిఎం వైయస్ జగన్, తెలంగాణ సిఎం కెసిఆర్, విజయశాంతిపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ” జగన్ అన్న నాకు వైయస్ఆర్సిపిలో ఎందుకు సీట్ ఇవ్వలేదని మీరే అడగండి ఇంతకు మించి ఈ విషయం పై నేను ఏమి మాట్లాడను” అని షర్మిల అన్నారు. అలానే నాకు మా తల్లి విజయమ్మ మద్దతు ఉందని తెలిపారు.
నేను తెలంగాణ వ్యక్తి ని కాకపోతే ఏంటని నా మూలాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షర్మిల పేర్కొంది. అలా చూసుకుంటే “కెసిఆర్ మరియు విజయశాంతి తెలంగాణకు చెందినవారా?” అంటూ ధీటుగా సమాధానం ఇచ్చారు షర్మిల. తనను ఒక రాజకీయ నాయకురాలిగా చూడవద్దని విద్యార్థులకు ఆమె విజ్ఞప్తి చేసింది. “నన్ను మీ సోదరి లేదా సాధారణ వ్యక్తిగా చూడండి. మనందరం కలిసి మెలిసి రేపటి మంచి, సమాజం కోసం కృషి చేద్దాం ”అని షర్మిల అన్నారు.
నిరుద్యోగ సమస్యపై షర్మిల టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. “వైయస్ఆర్ సిఎంగా ఉన్నప్పుడు, ఉద్యోగ నోటిఫికేషన్లు తరచూ వచ్చేవి, కాని కెసిఆర్ ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించింది. దీని కారణంగా తెలంగాణలో నిరుద్యోగం గత ఆరు సంవత్సరాల్లో పెరిగింది” అని షర్మిల తెలిపారు. ఇక తన రాజకీయ పార్టీ ప్రకటన గురించి అడిగినప్పుడు, అది మే లేదా జూలై నెలలో ఉండవచ్చు అని ఆమె సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: