Wednesday, June 23, 2021

Latest Posts

ఏ.పీ లో రెండో విడత వాహనమిత్ర పథకం

లాక్ డౌన్ కష్టకాలంలో ఉపాధి లేక చేతిలో డబ్బులేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక సాయం ప్రకటించింది ఏ.పీ ప్రభుత్వం. ఓనర్ కమ్ డ్రైవర్లు ఆటో మాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లు సొంతంగా వాహనాలు కొనుక్కోని నడుపుకుంటూ వృత్తిగా జీవిస్తున్నవారికి ఈ పథకం ద్వారా గత సంవత్సరంలో మొదటి విడత గా పది వేలు అందజేశారు. కరోనా కష్టకాలంలో వారికి మరొకసారి ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం చెయ్యడానికి ఏ.పీ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

వాహన మిత్ర పథకం ద్వారా సాయం పొందాలనుకునే లబ్దిదారులు దరఖాస్తు ప్రక్రియ మే26 లోపు వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పూర్తి చేస్తామని, అలాగే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.  అర్హులు సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా రవాణాశాఖకు సంబంధించిన డీటీసీ స్థాయి నుంచి ఎంవీఐ ఆఫీస్ వరకు ఈ- సేవ, మీ- సేవ, సీఎస్ సీ, ఎండీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల్లో డ్రైవర్లు తమ దరఖాస్తులు చేసుకోవచ్చని, జూన్ 4న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ రాజకీయాల పై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss