Thursday, May 13, 2021

Latest Posts

YCP ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం.. మండిపడుతున్న, ప్రజలు, నెటిజన్లు

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ కంపెనీకి అనుమతులు మీరు ఇచ్చారంటే.. మీరు ఇచ్చారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి కాక రేపింది. ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షం టీడీపీ మండిపడుతోంది. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ న్యూస్ ఛానల్ డిబేట్‌‌లో పాల్గొన్నారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి మాటలు అనకూడదేమో అంటూనే నోరు జారారు. ‘అయ్యో మా వాళ్ళు కూడా చచ్చిపోతే బాగుండే మాకు కోటి రూపాయలు వచ్చేవి అని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని ప్రజలు మరియు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మహిళా నేత రేవతి తప్పుబట్టారు.. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవిలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా స్పదించడం సమాజం కూడా సమర్దించదు.

ఇది కూడా చదవండి: ఐదుగురు వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss