Monday, May 10, 2021

Latest Posts

జూమ్ యాప్ తో జాగ్రత్త…హోం మంత్రిత్వ శాఖ..!!

zoom App is not safe government warns people video conference service

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (ఇంటినుంచే) సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సులకోసం  జూమ్ యాప్ వైపు చాలా సంస్థలు మొగ్గు చూపిస్తుండటం తో దీని  డిమాండ్ భారీగా పెరిగింది.  అయితే ప్రపంచవ్యాప్తంగా  రోజుకు 200 మిలియన్ల వినియోగదారులు దీనిని వాడటం జరుగుతుంది.  వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా వాడుతున్న ఈ యాప్ అంత సురక్షితమైనది కాదని హోం మంత్రిత్వ శాఖ తాజాగా షాకింగ్ న్యూస్ వెలువరించింది. జూమ్‌ను ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని తేల్చి చెప్పింది. సెక్యూరిటీ లోపాలకారణంగా, మీటింగ్‌ జరుగుతున్నప్పుడు మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు కూడా అందులో ప్రత్యక్షమయ్యే ప్రమాదం ఉంటుందనీ,  దీంతో ఆయా సమావేశంలో సంభాషణ వివరాలు, సున్నితమైన  సమాచారాన్ని, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించే ప్రమాదం వుందని హెచ్చరించడం జరిగింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss